నేను 2023, మార్చి 24న, ఈ వివాదాన్ని పరిశీలించడానికి పూణేకు వెళ్ళాను. ముందుగా, ఆశ్రమాన్ని అల్లుకున్న వారిని కలిశాను. వారిలో ఒకరు మా ధర్మజ్యోతి. 75 ఏళ్ళ ధర్మజ్యోతి, ఓషో ఆశ్రమం సమీపంలోని కొరేగావ్ పార్కులో నివాసం ఉంటున్నారు.
ఈ లాఠీచార్జ్‌లో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మార్చి 23న కోరేగావ్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో 128 మందిపై సమూహ హింస మరియు దాడుల సంబంధిత వేర్వేరు క్రిమినల్ సెక్షన్ల కింద ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయబడింది.
ఓషో ఆశ్రమం లేదా ధ్యాన రిసార్ట్, 1000 కోట్ల వివాదం: