అంతకుముందు, కామన్వెల్త్ గేమ్స్ చాంపియన్‌లు నీతు ఘణ్ఘస్ (48 కిలోలు) మరియు స్వీటీ బూరా (81 కిలోలు) మహిళల సెమీఫైనల్స్‌కు చేరుకోవడం ద్వారా భారతదేశానికి పతకాలు ఖాయం చేశారు.
నీతు పూర్తి ఉత్సాహంతో ఆడుతూ ప్రత్యర్థిపై విరుచుకుపడి పిడిగుద్దులతో పోరాటం చేసింది. రెఫరీ పోటీని ఆపి నీతుకు అనుకూలంగా తీర్పునిచ్చాడు. నీతు మూడు పోటీలలోనూ RSC తీర్పుతో విజయం సాధించింది.
భారతీయ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ వరల్డ్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. 50 కిలోల విభాగంలో థాయ్‌లాండ్‌కు చెందిన రక్షత్ చుత్మెత్‌ను ఓడించి సెమీఫైనల్స్‌కు చేరుకున్నారు.