టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనింగ్ చేసిన మిచెల్ మార్ష్ 65 బంతుల్లో 81 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. జోష్ ఇంగ్లీష్ 26, కెప్టెన్ స్టీవ్ స్మిత్ 22 పరుగులు చేశారు.
టీమ్ ఇండియాకు వాంఖేడే స్టేడియంలో చివరి విజయం 2011 అక్టోబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లభించింది. ఆ తర్వాత ఆ స్టేడియంలో ఆడిన 3 మ్యాచ్‌లలోనూ టీమ్ ఇండియా ఓడిపోయింది.
189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు టాప్ ఆర్డర్ అంతగా రాణించలేదు. ఒక దశలో జట్టు 39 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఇక్కడ ఇషాన్ కిషన్ 3, విరాట్ కోహ్లీ 4 మరియు సూర్యకుమార్ యాదవ్ 0 పరుగులకు ఔట్ అయ్యారు.
ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది; రహుల్ అర్ధ శతకం, జడేజాతో కలిసి 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నమోదు చేసింది.